ఏదో వ్రాయాలని, నా పైత్యాన్ని డల్లాస్ తెలుగు మిత్రులతో పంచుకోవాలని ఒకానొక బలహీన క్షణంలో కలిగిన బలమయిన కోరిక ఈ blog పుట్టుకకి దారితీసింది. అదెప్పుడో July 2007 లో మాట.అక్కడ్నుంచి బండి ముందుకి కదలలేదు.
ఈ 5 నెలల కాలంలో డల్లాస్ లో చాలామంది ప్రముఖుల్ని సాహితీ ప్రియుల్ని,వివిధ రంగాల్లో నిష్ణాతుల్ని కలుసుకోడం తటస్థించింది.అందులో చాలామంది మిత్రులయ్యారు కూడా.ఏదో ఒక సదస్సు లేదా పార్టీ లేదా ఫంక్షన్ లో వీళ్ళందరినీ తరచుగా కలుసుకోడం జరుగుతూనే ఉంది.
ముఖ్యంగా ప్రసాద్ తోటకూర గారి చొరవతో తెలుగు సాహిత్య వేదిక ప్రారంభం అయ్యాక సందడి బాగా పెరిగింది.నెల నెలా తెలుగు వెన్నెల కురవడం మొదలయ్యాక మిత్రులందరికీ భావాల్ని అనుభవాల్ని పంచుకోడానికీ సరయిన వేదిక దొరికినట్లయింది.
నిజం చెప్పొద్దూ ! ప్రతి నెలా మూడో ఆదివారం వచ్చేదాకా తెలుగు వెన్నెల కోసం ఆగాలంటే చకోరపక్షి ఎదురుచూపులానే ఉంది.
అందుకని,ఈ నెల రోజులపాటూ మిత్రులందరి మధ్య సూత్రసంధానం చేయడానికి ఈ blog బాగుంటుందేమో అని చిన్న ఆలోచన వచ్చింది.
ఇందులో నేనొక్కడ్నే కాదు..మీరందరూ ఏదో ఒకటి కెలకొచ్చు. తెలుగు లిపిలో ఎలా వ్రాయాలో తెలియకపోతే మీకు సహాయం చేయడానికి నేనున్నాను !లేదంటే నాకు మీరు వ్రాసిన విషయాన్ని English letters లో టైప్ చేసి E-mail చేస్తే దాన్ని తెలుగు లిపిలో నేను ఈ blog లో పోస్టుతా !
ఇంకెందుకు ఆలస్యం ? కలాలు..సారీ..కీబోర్డులు ఝళిపించండి !
ఇంతకీ ఏం వ్రాయలని ఆలోచిస్తున్నారా ?
ఏదయినా వ్రాయొచ్చు మాష్టారూ ! కథలు, కవితలు, పాటలు, రాజకీయాలు, వార్తలు, సినిమాలు, డల్లాస్ తెలుగోడి జీవితం, మీ ఆఫీస్ కబుర్లు..ఏదయినా పర్లేదు !
కాదేదీ బ్లాగుకనర్హం అని శ్రీశ్రీ గారే సెలవిచ్చారు !!
2 comments:
హలో కే సి గారు,
ఈ లింక్ ద్వారా ఇంగ్లీష్ నుండి తెలుగు కి త్రన్స్లాటే చేయవచ్టు
http://www.google.com/transliterate/indic/Telugu
నేను మా హ్యుస్టన్ కబుర్లు రాస్తున్నాను. హ్యుస్టన్ అయితేనేమిరా మరి డల్లాస్ అయితేనేమిరా ఎక్కడైనా తెలుగోడి గోడు ఒకటే అన్నట్లు...మేము ఇక్కడ కూడా తగినంత కలాపోసన చేస్తామండోయి. డిసెంబరు ఒకటవ తారీఖున మా తెలుగు సాంస్కృతిక సమితి తరఫున పిల్లలకి తెలుగు పోటీలు పెడుతున్నాము. ఈసారి విశేషం ఏమిటంటే వక్త్రుత్వ పోటీలు కూడా పెడుతున్నాము. పిల్లలకే కాకుండా పెద్దవాళ్ళకి కూడా. చక్కటి తెలుగులో ఎక్కడా ఒక్క ఆంగ్ల పదం దొర్లకుండా ఇచ్చిన అంశం మీద మాట్లాడాలి. పోటీలు అయిపోయాక మరిన్ని వివరాలు ఇస్తాను. ఇక్కడ బ్లాగేందుకు అవకాశం ఇచ్చిన చేకూరి గారికి ధన్యవాదాలు తెలుపుకుని శలవు తీసుకుంటాను ...
హ్యుస్టన్ ఉమాదేవి
Post a Comment