
డల్లాస్ సాహితీ మిత్రులందరినీ అభినందిస్తూ జాగ్స్ మాష్టారు మల్లెపూల సౌరభంతో ఒక పద్యాన్ని సంధించారు. నెల నెలా విరగకాస్తున్న తెలుగు సాహితీ కౌముదిని అనుభవించే అదృష్టం మనకిచ్చిన తెలుగుతల్లికి జగదీశుని వందనాపూర్వక భక్తిమల్లెలు !
(ఆచార్య. పుదూర్ షణ్ముఖ జగదీశ్వరన్)
సీ ప్రాకుచున్నది గదా వైభవమ్ములతోడ
మధురంపు పులిగండ్ల వారి గరిమ
వెలయుచున్నది గదా విభవన్మహాశ్రీల
సొంపైన శ్రీనివాసుల యశస్సు
పరిఢవిల్లును గదా ప్రాభవములతోడ
సహౄదయపూర్తి ప్రసాదు కీర్తి
ఇనుమడించును గదా ఇష్టార్ధములతోడ
రమ్యంపు కల్వల రావు సొగసు
స్ఫూర్తిజెందును గదా సురకాంతలను మించు
ఘనమైన జగదీశు కవనకాంత
ఖ్యాతి కెక్కును గదా నీతి దర్పముతోడ
కోమలంబగు తోటకూర ప్రతిభ
తేగీ నెల నెల వెల్గు తెలుగు వెన్నెలల వల్లన
దీని తోడైన చేకూరి దీవెనలతో
దొర్లుచున్నది తెలుగు కబుర్లు సతము
డల్లసు తెలుగు తల్లికి మల్లెపూలు
(ఆచార్య. పుదూర్ షణ్ముఖ జగదీశ్వరన్)
(నవంబరు 26, 2007)
1 comment:
జాగ్స్ గారికి,
పులిగండ్ల,ఆళ్ళ శ్రీనివాసుడు,యెంవీయెల్ ప్రసాదు,తోటకూర ప్రసాదు గార్ల తరపున,నా తరపున కృతజ్ఞతలు.
కేసి చేకూరి.
Post a Comment