ఈ మధ్య ఒక రెండు,మూడు వారాలనుండి "ఈనాడు" దినపత్రిక భాషలో తేడా కనబడ్తున్నది.
ఇదివరకు యధాలాపంగా వాడే ఇంగ్లీష్ పదాల బదులుగా కొత్త తెలుగు పదాలు కనబడ్తున్నాయి.
ఈ మధ్య కాలంలో (ఇవాళ్టితో సహా)నేను గమనించిన పదాలు ఇవీ.
ఎడమవేపు మాములుగా వాడే ఇంగ్లీష్ పదాలు, కుడివేపు ఈనాడులో వాడుతున్న తెలుగు పదాలు.
కాంట్రాక్టర్ = గుత్తేదారు
జూనియర్ డాక్టర్స్ = చిన్న వైద్యులు (ఇంకా నయం..ఆంధ్రభూమిలాంటి పేపర్లు "జూడా"లు అంటున్నాయి. దారుణం !)
సెన్సార్ బోర్డ్ = ఉచితానుచిత నిర్ణాయక మండలి
టోల్ = సుంకం
సింగిల్ లైన్ = ఏక మార్గం
కాకపోతే ఈ తెలుగు పదాలపక్కనే బ్రాకెట్లలో(కుండలీకరణాలు సరయిన పదమా?)ఇంగ్లీష్ పదాన్ని కూడా ఇస్తున్నారు. మీరు చూసిన పదాలు ఇక్కడ పోస్ట్ చేయండి.
Subscribe to:
Post Comments (Atom)
2 comments:
ఔను, దీని గురించే నేనూ బ్లాగుదామనుకున్నాను. మీరు రాసేసారు.
అలవాటయ్యేదాకా అలా బ్రాకెట్లలో ఇస్తారు గామోసు. ఈ జూడా అనేమాట ఇవ్వాళ ఈనాడులో కూడా చూసాను. ఐతే అది ఎవరినో ఉదహరిస్తూ వేసినట్టున్నారు. ఏదేమైనా ఇలా తెలుగులో రాయడం నాకెంతో నచ్చింది.
ఔను నేనూ గమనించి సంతోషించాను.
Post a Comment