2009 ఎలక్షన్ల ఫలితాలు అప్పుడే వచ్చేశాయి ఇంటర్నెట్లో.
చిరంజీవి పైన ఇండిపెండెంట్ అభ్యర్ధిగా పోటీ చేసిన మోహన్ బాబు ఓటమి !
ముఖ్యమంత్రిగా చిరంజీవి ప్రమాణస్వీకారం
వైద్య ఆరోగ్య శాఖామంత్రి-- డా సమరం
ఆర్ధిక శాఖామంత్రి- అల్లు అరవింద్
సమాచార,పబ్లిసిటీ శాఖామంత్రి--Mr శ్రీజ శిరీష్
హోం మినిస్టర్- పవన్ కల్యాణ్
సాంస్కృతిక వ్యవహారాల శాఖామంత్రి- రవితేజ
ఆస్థాన సంగీత విద్వాంసుడు- దేవిశ్రీ ప్రసాద్
ఆస్థాన నిలయ విద్వాంసుడు- శ్రీకాంత్
పార్టీ యువజన విభాగం అధ్యక్షుడు- అల్లు అర్జున్
ప్రతిపక్ష నాయకుడు- నందమూరి బాలక్రిష్ణ
లాల్ బహదూర్ స్టేడియంలో ప్రమాణస్వీకారం చేసిన వెంటనే సంతకం చేసిన మొదటి ఫైలు- "ఆర్య సమాజ్ లో ప్రేమ పెళ్ళిళ్ళని BAN చేయడం" !
ఇహ మాజీ ముఖ్యమంత్రులు- ఒకాయన ఫ్యాక్షన్ వ్యాపారాన్ని,ఇంకొకాయన తన పాలవ్యాపారాన్ని పునరుధ్ధరించుకుని శేషజీవితం గడుపుతూ " ఏ ఒక్కరికీ బాధ కలిగించకుండా " , "ఆ విధంగా ముందుకుపోతున్నారు".
కాబినెట్ విస్తరణకు చాలా ఖాళీ ఉంది. మీకు తోచినవారికి మీరు కూడా పదవులు, మంత్రిత్వ శాఖలు ఇచ్చుకోవచ్చు.
Subscribe to:
Post Comments (Atom)
5 comments:
సూఫర్...సూఫర్...సూఫర్
హహహహహహహహ
చాలా బాగుంది. అయినా ఎవరొచ్చినా మన తెలుగు భాషకి ఒరిగి చచ్చేదేమిటో నాకు తెలియడంలేదు. ఇప్పటికే స్కూళ్ళల్లో తెలుగు అధోగతి లో ఉంది. ఇంగ్లీష్ మాట్లాడక పోతే ఫైన్ వేస్తారు, మాతృభాష అంటే మనకి చిన్న చూపు. భాషలో ఉన్నఅక్షరాలు పీకేసి ఎవరికితోచిన వత్తులు వారు వాడుతూ రొష్టు పట్టిస్తున్నారు. మళ్ళీ తెలుగు భాషకి మంచి రోజులు రావాలంటే అన్నగారి కున్న భాషాభిమానం, చిత్తసుద్ధి ఉన్న నాయకుడు రావాలి.
నిజమే ఆంద్రదేశంలో ఎవ్వరికి చిత్తసుద్దిలేదు....
కేవలం మనకు మాత్రమే....ఉంది.... కదా ???
ఇప్పుడున్నావాళ్ళూ బాగు చేయంది... రేపు వచ్చేవారు చేయలేంది...ఒకటుంది... అది బాగయ్యేదాకా ఇంతే...సాక్షాత్ శ్రీమన్నారణుడొచ్చినా... ఎదొక జాడ్యంకిందకు లాగేసి... వీడు మావాడయ్యా.... అని మడ్డిగీతగీసుకునే వాళ్ళూ ఉన్నంతకాలం......
జ్ఞాన శునకాలు మెరుగుతూనే ఉంటాయి.... కుచిత జంబూకాలు కుట్రపన్నుతూనే ఉంటాయి....
Umadevi,
Everyone sees a problem in different ways. For you the first priority is TELUGU LANGUAGE. For some other person who is not having basic things his/her priority might be food and shelter. Go and see the villages they speak very good telugu than you are trying to.
Post a Comment