Monday, January 28, 2008

మోహన్ బాబు సందట్లో సడేమియా

సినీనటుడు రాజశేఖర్ చిరంజీవికి రాజకీయానుభవం లేదని భీమవరంలో వ్యాఖ్యలు చేశారట. దానికి కోపగించి చిరు అభిమానులుగా చెప్పుకున్న కొందరు, పిల్లలతో వెళ్తున్న రాజశేఖర్ కుటుంబం పైన దాడి చేసి (పిల్లల్ని) గాయపరిచిన విషయం ఈ రోజు వేడి వార్త.

మీలో ఈ వార్త ఇంకా ఎవరికయినా తెలియకపోతే మెరుగయిన సమాజం కోసం రోజుకి 25 గంటలు తపించే ఒక ఛానెల్ని సంప్రదించండి.

రాజశేఖర్ గారివి వ్యక్తిగత వ్యాఖ్యలు.తన అభిప్రాయాన్ని వెలిబుచ్చే హక్కు ఆయనకుంది. అభిప్రాయాల్ని వెలిబుచ్చినందుకు ఆయన మీద, పసిపిల్లల మీద దాడి చేయడం అమానుషం.ఖండించాల్సిన అంశం.అదే సమయంలో రాజశేఖర్ కూడా ఆలోచించవలసిన విషయం ఒకటి ఉంది. అసలు చిరంజీవిగారు తనంతట తాను రాజకీయాల్లోకి వస్తానని చెప్పలేదు ఇంతవరకూ. ఆయన చెప్పకుండానే, వస్తాడో రాడో తెలియకుండానే, మనకి అభిప్రాయం వెలిబుచ్చే హక్కు ఉంది గదా అని, ఆయనకి రాజకీయానుభవం లేదని కామెంట్ చేసి వివాదాన్ని కొనితెచ్చుకోడం ఎందుకు ?
దాడి జరిగిందని తెలిసి చిరంజీవి రాజశేఖర్ ఇంటికెళ్ళి పరామర్శించి, క్షమాపణలు తెలియజేయడం చాల సంస్కారవంతంగా ఉంది.

కానీ ఆయన ఆ ప్రెస్ మీట్లో కొన్ని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. సంఘటనని బహిరంగంగా ఖండించదల్చుకుంటే ఆ పని ఎలాంటి శషభిషలు లేకుండా చేయాలి. "అభిమానులు మనస్తాపం చెంది ఉంటారు...హర్ట్ అయి ఉంటారు. కానీ వాళ్ళ ఆవేశం కంట్రోల్ చేసుకోవాలి".. ఏమిటీ సోది ?

రాజకీయాల్లోకి రావడానికి,అధికారం అందుకోడానికి రాజకీయానుభవం అనేది ప్రాతిపదిక కాదు.ఎన్.టి.రామారావ్ పార్టీ పెట్టినప్పుడు కూడా ఈ విమర్శ వచ్చింది. దానికి సమాధానం జనమే తేల్చి చెప్పారు.ఎన్టీయార్ కయినా,రాజీవుడికయినా, సోనియాకయినా, చిరంజీవికయినా ఆ విమర్శ అక్షరాలా వర్తిస్తుంది. దానికి దురభిమానులు ఆవేశపడాల్సింది ఏంలేదు.రాజశేఖర్ మాట్లాడింది సత్యమే అంటూనే, దానికి అభిమనులు మనస్తాపం చెంది ఉంటారు అని ఈయనే చెప్పడం ఏంటి ? ఇప్పటిదాకా ఇదెవరో దురభిమానులు చేసింది అని అనుకుని ఖండించవచ్చు. చిరంజీవి ఇలా చెబ్తే, ఓహో మేము కూడా మనస్తాపం చెందాలి కాబోలు అని మామూలు అభిమానులు కూడా ఆవేశపడే ప్రమాదం ఉంది.రేపొద్దున్న ఇంకెవరన్నా ఏదన్నా అంటే మళ్ళీ ఇదే డ్రామా మొదలు.

నాగబాబు వచ్చి వాళ్ళు రిజిష్టర్డ్ ఫాన్స్ కాదు...అన్-రిజిష్టర్డ్ ఫాన్స్ అంటాడు. అదేదో కావాలని ఎవరో చేసినట్లుగా . దుండగులో, చిరంజీవికి చెడ్డపేరు తెచ్చే కుట్రో అయితే ముసుగులు వేస్కుని ఆ పని చేసేవాళ్ళు. ఇలా బహిరంగంగా, తమ కూడా వీడియో కెమెరాలు తెచ్చుకుని, దాడిని చిత్రీకరించి, మళ్ళీ ఆ క్యాసెట్ ని టివి ఛానెల్స్ కి పంపి ఉండేవాళ్ళు కాదు.

ఇహ వెంటనే పరామర్శల పర్వం మొదలయింది. ఆ సందట్లో అసలయిన సడేమియా మోహన్ బాబు గారిది. ఆయన గురువుగారికిమల్లే (దాసరి)ఈయన సగం శ్లేషతో,సగం వ్యంగ్యంతో, సగం మన కాల్పనిక,ఊహాశక్తికి వదిలేస్తూ మాట్లాడ్డం ! రాజశేఖర్ కూడా సిల్వర్ జూబ్లీ, గోల్డెన్ జూబిలీ సినిమాలు తీశాడు అంటాడు. ఇక్కడెవరూ పిరికివాళ్ళు లేరు, అసమర్ధులు లేరు అంటాడు. అసలు దానిగురించి ఇప్పుడెందుకు ? ఎవర్ని రెచ్చగొడ్తున్నాడో అర్ధం కాదు. ఎవరు చేయించారో ప్రజలకే తెలుసు అంటాడు. చిరంజీవి చేయించాడేమో అన్న అర్ధం రావాలనేమో ! ఇక అసలు పరామర్శకి వచ్చాను అనే విషయం వదిలేసి ఆయన మంచితనం గురించి,ఆయన కుటుంబం గురించి స్వోత్కర్ష ! రాజశేఖర్తో కలిపేసుకుని నేను చాలా మంచోడ్ని అని సొంతడబ్బా..ఏ సంఘటన జరిగినా, ఏ సందర్భంలో అయినా ఆవు మీద వ్యాసం రాసినట్లుగా మాట్లాడగల సమర్ధుడు మోహన్ బాబు !

ఈ కామెడీ ఇంకా కొనసాగబోతోంది! వేచి చూడండి !

5 comments:

రాధిక said...

చిరంజీవి ఏమీ ప్రకటించకుండా రాజశేఖర్ అలా మాట్లాడకూడదు అంటున్నారు.కానీ అసలు జరిగిన విషయం ఏమిటంటే ఒక మామూలు పెస్ మీట్ లో జర్నలిస్టులు అడిగిన ఒక ప్రశ్నకి సమాధానం గా రాజశేఖర్ అలా చెప్పారు.ప్రశ్న ఏమి టంటే "చిరంజీవి పార్టీ పెడితే మీరు ఆ పార్టీలో చేరుతారా" అని.దానికి రాజశేఖర్ సమాధానం "చేరను.ఆయనకి అనుభవం లేదు"ఇంతే అన్నాడు.ఆ ప్రెస్ మీట్ వీడియో క్రింద చూడండి.
http://videos.telugupeople.com/clipings.aspx?id=1168
ఇక మధ్యలో ఈ మోహన్ బాబు ఒకడు.ఎక్కడ ఎవడికి ఏమి జరిగినా[అదీ చిరంజీవి కి సంబధించిన విషయం అయితే]అక్కడ ఆయన ప్రత్యక్షం.ఒకడి ఇల్లు కాలిపోతూ వుంటే తన చుట్టకి నిప్పు దొరికిందని సంబర పడిపోయే రకం.

Anonymous said...

ఆ వీడియో చూశాకే బ్లాగ్ లో పోస్ట్ రాశాను. చేరను అన్నంత వరకు బాగానే ఉంది. ఆయనకి అనుభవం లేదు అనగానే మీడియా దాన్ని కొండంత చేసింది. అవకాశం ఈయన ఇచ్చాడు. ఇక అందరూ అందిపుచ్చుకుంటున్నారు. అంతే.

Anonymous said...

daadi amanushame but adi chiranjeevi fans chesara..mariokaru chesaara ani telusukokunda maatladatam waste..edi emaina chiranjeevi athanintiki velli sorry cheppadam baagundi..but indulo nijaalento velugu chuse varaku manamemi cheppalem..mohanbaabu gurinchi emi raastham lendi athani gurinchi telisinde kada andarikeenu

Anonymous said...

KC garu rajasekhar gari abhiprayam cheppadam lo thappu ledhu.party pedithe ani vilekharulu adiginappudu -ayanaki anubhavam ledhu ganuka cheranu anadam lo ye mathram thappu ledhu.ayana chethulara thechi pettukunna godava kadhu ,fans murkhathvam valla garindhi idhantha.

Anonymous said...

rajasekhar alaa anakundaa undaalsindi. mike undi kadaa ani ishtanochinattu maatlaadite idigo ilaage untundi. chiranjeevi vachi sorry ani cheppina taruvaata koodaa rajasekhar pichi pichi gaa maatlaadaadu. koTTina vaallani anaali kaanee chiranjeevini anaalsina avasaram ledu kadaa.